
సాక్షి, న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో మాజీ ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు చందా కొచర్‌ను ప్రశ్నిస్తున్నారు. మే 5న ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో చందా కొచర్‌తోపాటు, ఆమె భర్త దీపక్ కొచర్కు కూడా దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది.
కాగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన కంపెనీకి ప్రయోజనం చేకూర్చేందుకుగాను వీడియోకాన్ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై బ్యాంకు అంతర్గత విచారణ అనంతరం బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులనుంచి తొలగిస్తూ ఐసీఐసీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఇతర బెనిఫిట్ల చెల్లింపులను నిరాకరించడంతోపాటు, గతంలో చెల్లించిన వాటిని తిరిగి బ్యాంకుకు జమ చేయాలని కూడా బోర్డు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment