న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో చందా కొచ్చర్ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది. 2009–2011 మధ్య కాలంలో వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో చందా కొచర్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన మేలుకు ప్రతిగా వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. చందా కొచర్ భర్తకు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్‌లోకి కొంత పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత వీడియోకాన్ గ్రూప్ తీసుకున్న రుణాలు మొండిబాకీలుగా మారడం గమనార్హం. మొత్తం మీద ఇదంతా చందా కొచర్ కుటుంబం, ధూత్‌లకు లబ్ధి చేకూర్చేలా క్విడ్ ప్రో కో వ్యవహారంగా జరిగిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment