సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది.మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ముంబై ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది. (ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్ భర్త అరెస్టు)
మనీలాండరింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద దీపక్ కొచర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం అరెస్టు చేసింది.ఈ కేసులో సేకరించిన కొన్ని తాజా సాక్ష్యాల గురించి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అతన్ని కస్టోడియల్ విచారణను కోరినట్టు ఈడీ అధికారులు తెలిపారు. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1,875 కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా మంజూరు చేసిన ఆరోపణలతో ఈడీ గతంలో కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment