సాక్షి, ముంబై: ఐసీఐసీఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ కొచర్‌కు భారీ ఊరట లభించింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్‌కు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే జైల్లో ఉండగానే కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీని ముంబై ప్రత్యేక కోర్టు గతంలో పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment