Businesswomen
-
18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?
ఒక స్త్రీ సంపాదించగలిగినప్పుడు.. ఆమె అధికారం పొందుతుందని, తన బిడ్డలను పాఠశాలకు వెళ్లేలా చేస్తుందని గట్టిగా నమ్మే మహిళలలో ఒకరు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'దీపాలీ గోయెంకా'. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు.వ్యాపారవేత్త బాలక్రిషన్ గోయెంకాను 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న దీపాలీ గోయెంకా.. వివాహం తరువాత 1987లో ముంబైకి వెళ్లారు. తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకోవాలనే కోరికతో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన కొత్త ఆలోచనలతో తనను తాను నిరూపించుకోగలిగింది.సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీపాలీకి టెక్ట్స్‌టైల్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వంటివి కూడా పూర్తి చేసింది. పెళ్ళైన తరువాత ఈ టెక్ట్స్‌టైల్ రంగంలోకి అడుగుపెట్టింది.పరిచయమే లేని ఓ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే.. ఆ రంగంలో ఆరితేరిన దీపాలీ 2016లో ఫోర్బ్స్ ఆమెను ఆసియాలో 16వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించింది. దీపాలీ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నేను ఆమె కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 18,566 కోట్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే పనిచేస్తుండేవారు. కానీ ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. నేడు ఆ సంస్థలో ఏకంగా 30 శాతం కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎదగాలనే సంకల్పంతో మహిళలను దీపాలీ ప్రోత్సహిస్తోంది. -
Budget 2024: ఉమెన్ పవర్‌కు ఊతం ఇచ్చేలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి. వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు? మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల అభిప్రాయాలు... ప్రత్యేక నిధి గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి. –స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో మహిళా శ్రేయస్సు మహిళల హెల్త్‌కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. – రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద గేమ్ చేంజర్‌గా... మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్‌చేంజర్‌గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి. – సోమ్దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్ మరిన్ని పొదుపు పథకాలు గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్‌కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా... పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. – జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో బాలికల విద్యకు ప్రాధాన్యత రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్‌ను పెంచాలి. – రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కోల్‌కతా చాప్టర్)– చైర్పర్సన్ మహిళా రైతుల కోసం... బడ్జెట్లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి. – ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. – నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్ -
రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
Aditi Avasthi founder and CEO of Embibe: మహిళలు అనుకుంటే సాధించలేనది ఏదీ లేదు. ఏ రంగంలోనైనా తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అలాంటి విజయవంతమైన మహిళల్లో ఒకరే అదితి అవస్తీ. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఎంబైబ్ వ్యవస్థాపకురాలు, సీఈవో. టాప్ ఎడ్టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి బైజూస్, ఫిజిక్స్ వాలా, అనకాడెమీ వంటి పెద్ద ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది ఎంబైబ్. ఇదీ చదవండి: Divis Laboratories: ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు! అదితి అవస్తీ నేపథ్యం అదితి అవస్తీ పంజాబ్‌లోని లూథియానాలో జన్మించించారు. 2003లో థాపర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశారు. చికాగో యూనివర్సటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసిన అదితి అవస్తి తర్వాత బార్క్లేస్లో ఆఫ్రికాలోని మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రాటజీ హెడ్‌గా పనిచేశారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ సహాయంతో 7 లక్షల డాలర్ల నిధులతో 2012లో ఎంబైబ్ సంస్థను స్థాపించారు. తర్వాత కలారి క్యాపిటల్, లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి కూడా పెట్టుబడులను సాధించారు. రిలయన్స్ పెట్టుబడులు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను మెప్పించి తన ఎంబైబ్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. 2018లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 180 మిలియన్ డాలర్లను ఎంబైబ్‌లో ఇన్వెస్ట్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంబైబ్‌లో 73 శాతం వాటాను కొనుగోలు చేయింది. అలాగే 2020లోనూ అదనంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. గుర్తింపులు, అవార్డులు అదితి అవస్తి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు. 2017లో బీబీసీ టాప్ 100 మంది మహిళలలో స్థానం సాధించారు. 2018లో వోగ్ ఆమెను 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది. రూ.1600 కోట్లకుపైగా నిధులు నివేదికల ప్రకారం.. ఎంబైబ్ నాలుగు రౌండ్లలో మొత్తం 196.7 మిలియన్ డాలర్లు( రూ.1600 కోట్లకుపైగా) నిధులను సేకరించింది. కంపెనీ చివరి సారిగా 2020 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్నోవెన్ క్యాపిటల్‌తో సహా నాలుగు సంస్థలు ఎంబైబ్కు నిధులు సమకూరుస్తున్నాయి. గోవా ప్రభుత్వంతో భాగస్వామ్యం గోవా ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎంబైబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని సుమారు లక్ష మంది విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించనుంది ఎంబైబ్. బిజినెస్ రంగంలో ఇలాంటి విజయగాథలు, స్పూర్తివంతమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండండి. -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
శక్తిమంతమైన భారత నారీమణులు వీరే..
భారత్‌లో అత్యంత శక్తివంతమైన మహిళా వాణిజ్యవేత్తగా ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యను ఫోర్బ్స్ మేగజీన్ మరోసారి ఎంపిక చేసింది. ప్రతియేటా ప్రపంచంలోని వివిద కార్పొరేట్ స్థాయి కంపెనీలకు చెందిన మేటి సీఈవోలను, ఎండీలను గుర్తించే పోర్బ్స్ మేగజిన్ తాజా జాబితాను విడుదల చేసింది. 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో ఆరుగురు భారతీమణులకు చోటుదక్కించుకున్నారు. ఈ ఆరుగురిలో తొలిస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుందతి భట్టాచార్య దక్కించుకోగా, ఆ తరువాత వరుసగా ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్/ శ్రీరామ్ క్యాపిటల్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, యాక్సిస్ బ్యాంక్ సీఈవో ఎండీ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్ ఉన్నారు. గతంలో కూడా అరుంధతీ భట్టాచార్య ఇందులో ప్రధమ స్థానం దక్కించుకున్నారు.