రిలయన్స్ పేమెంటు బ్యాంకుకు రిటైల్ ఊతం
న్యూఢిల్లీ : ప్రతిపాదిత పేమెంటు బ్యాంకుకు విస్తృత నెట్‌వర్క్ ఉన్న తమ టెలికం వ్యాపారం, రిటైల్ వ్యాపారం కూడా తోడ్పాటు అందివ్వగలవని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తెలిపింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జియోమనీ పేరిట ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఎస్‌బీఐతో కలసి ఆర్‌ఐఎల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐతో భాగస్వామ్యం వల్ల పేమెంట్ బ్యాంకు మరింత సమర్ధంగా పనిచేయగలదని, విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోగలదని ఆర్‌ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు.
సమర్థ, సరళమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్‌ఐఎల్ డిజిటల్ సాంకే తికత తోడ్పడుతుందని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తెలిపారు.