ఆన్‌లైన్ వ్యాపారానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. ‘యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్’ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 కోట్ల చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్ కంపెనీల పోటీకి ఇప్పటికే అమెరికాలో చిన్న వ్యాపారులు కనుమరుగయ్యారు. భారత్‌లోనూ ఈ ప్రమాదం ఉంది. కానీ కేంద్రం స్పందించి చర్యలు తీసుకుంటోంది. 14 కోట్ల మంది భారతీయ రైతులు, వారి కుటుంబాలు, తమ పిల్లల భవిష్యత్తు కోసం, 140 కోట్ల భారతీయుల ఆంకాక్షలు నెరవేర్చడానికి యూఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కీలక ఖనిజాల విషయంలో ఇరు దేశాలకు ఆందోళనలు ఉన్నాయి. ఈ విభాగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నాం’ అని మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు..
ఆన్‌లైన్ వ్యాపార ధోరణిపై మంత్రి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థలు పుట్టుకురావడం గొప్ప విషయంగా భావించకూడదన్నారు. ఆ సంస్థలు ధరల విషయంలో పోటీ పడేందుకు విభిన్న మార్గాలు అనుసరిస్తున్నారని చెప్పారు. దాంతో రిటైల్ వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారని వివరించారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి త్వరలో కొత్త పాలసీ తీసువస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment