క్యూ2 లాభం రూ. 16,563 కోట్లు
ఆదాయం రూ. 2.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్‌లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి.
రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది.
టెలికం జోరు
ఈ ఏడాది క్యూ2లో ఆర్‌ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్‌చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్‌ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవించింది. సబ్‌్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది.
రిటైల్ ఓకే
రిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్‌ఐఎల్ షేరు బీఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.
డైవర్సిఫైడ్ బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది.
– ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ చైర్మన్, ఎండీ
Comments
Please login to add a commentAdd a comment