ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మంతనాలు
ముంబై: ఒత్తిడిలో ఉన్న మొండి బకాయిల సమస్య పరిష్కరించుకునేలా త్వరలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)లను బలోపేతం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అవినీతి నిరోధక చట్ట సవరణలకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పీఎస్‌బీల ఆరోగ్య స్థితి ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు.
ఇతరులతో పోటీపడి పని చేసేలా పీఎస్‌బీలకు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎస్‌బీలకు ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుగా పేర్కొన్నారు. అలాగే, అవినీతి నిరోధానికి సంబంధించిన ప్రస్తుత చట్టం (పీసీఏ 1988) సైతం వారిని వాణిజ్య కోణంలో నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందని వివరించారు. చట్ట సవరణతో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ భారతం, మౌలికరంగాలను పైకి తీసుకురావడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రెండు రంగాల్లో పెట్టుబడుల లోటు భారీ స్థాయిలో ఉందన్నారు.
బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచర్, కోటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్, అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ తదితరులు