నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్ | Digital transactions in banking sector going up: SBI chief Arundhati Bhattacharya | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

రద్దరుున పెద్దనోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందేలా నల్లకుబేరులకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య హెచ్చరించారు. కోయంబత్తూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడాదికి 200 నుంచి 300 మంది క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారని చెప్పారు. నల్లధనాన్ని చట్టవిరుద్ధంగా బ్యాం కుల్లో జమచేసి కొత్త నోట్లుగా మార్చుకునేవారిపైనా, వారికి సహకరించే బ్యాంకు సిబ్బందిపైనా నిఘాపెట్టామని తెలిపారు. పట్టుబడిన వెంటనే సస్పెండ్ చేసి నేరం రుజువైన పక్షంలో డిస్మిస్ చేస్తామని ఆమె హెచ్చరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement