నల్లకుబేరులకు సహకరిస్తే డిస్మిస్
• బ్యాంకు సిబ్బందికి హెచ్చరిక
• దేశవ్యాప్తంగా పీఓఎస్ సేవలు
• ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: రద్దరుున పెద్దనోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందేలా నల్లకుబేరులకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య హెచ్చరించారు. కోయంబత్తూరులో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏడాదికి 200 నుంచి 300 మంది క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారని చెప్పారు. నల్లధనాన్ని చట్టవిరుద్ధంగా బ్యాం కుల్లో జమచేసి కొత్త నోట్లుగా మార్చుకునేవారిపైనా, వారికి సహకరించే బ్యాంకు సిబ్బందిపైనా నిఘాపెట్టామని తెలిపారు. పట్టుబడిన వెంటనే సస్పెండ్ చేసి నేరం రుజువైన పక్షంలో డిస్మిస్ చేస్తామని ఆమె హెచ్చరించారు. నోట్లను రద్దరుున ఈనెల 8వ తేదీ నుంచి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ద్వారా ఖాతాదారుల సేవలు సక్రమంగా సాగుతున్నాయని తెలిపారు. తమ బ్యాంకు ఏటీఎంలలో 65 శాతం పూర్తిస్థారుులో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఖాతాదారులు శ్రమపడకుండా సొమ్మును పొందేందుకు పారుుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)తో కూడిన వాహనాన్ని జన సంచారం ఎక్కువగా ఉండే కూడళ్లలో పెట్టామని తెలిపారు. ఖాతాదారులు తమ ఏటీఎం, డెబిట్ కార్డులను ఈ వాహనంలోని యంత్రంలో స్వైప్ చేసి రూ.2వేలు పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 3,600 పీఓఎస్ వాహనాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. అంతేగాక విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ప్రాంతాల్లో 841 మొబైల్ ఏటీఎంలు పనిచేస్తున్నట్లు తెలిపారు.
రెండు వారాలుగా బ్యాంకు లావాదేవీల్లో కొంత గందరగోళం, విద్య, గృహ రుణాల మంజూరులో కొద్దిపాటి స్తంభన నెలకొని ఉందని అంగీకరించారు. అరుుతే ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల్లో పూర్తిగా సర్దుకుంటుందని చెప్పారు. నిజారుుతీగా సంపాదించిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు భయపడాల్సిన అవసరం లేదని, వీరి సొమ్ముకు వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.