తాడేపల్లి రూరల్ (మంగళగిరి) : మంగళగిరిలోని ఎస్‌బీఐలో ఉన్నట్టుండి సోమవారం రాత్రి అలారం మోగడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురై సీఐ హరికృష్ణ, ఎస్సై వినోద్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించగా ఎటువంటి అనుమానించదగ్గ అంశాలు కనపడలేదు. అలారం అరగంట మోగి ఆగిపోయింది. అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని పోలీసుల పరిశీలనలో నిర్ధారించారు. బ్యాంకులో మొత్తం 6 కిటికీలు ఉండగా, వాటి తలుపులన్నీ తీసి వెళ్ళినట్లు గుర్తించారు. దీనిపై బ్యాంకు అధికారులు, సిబ్బందితో మాట్లాడేందుకు సీఐ ప్రయత్నించగా ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు. చివరకు పోలీసులే ఆ కిటికీల గుండా లోపలకు టార్చిలైట్లు వేసి పరిశీలించారు. పోలీసులు అక్కడే బ్యాంకు సిబ్బంది రాక కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment