
అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎస్‌బీఐ చీఫ్
ముంబై: బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు చోటు లభించింది. ఈ లిస్టులో స్థానం సాధించిన ఏకైక భారతీయ మహిళ ఈమే కావడం గమనార్హం. ఎస్‌బీఐ తొలి మహిళా చైర్‌పర్సన్ అయిన అరుంధతికి బ్యాంకర్ల కేటగిరీలో స్థానం కల్పించారు. వచ్చేనెలలో విడుదల కానున్న ప్రత్యేక సంచికలో వివరాలను ప్రచురించనున్నారు.
భారత్‌లోని అతిపెద్ద బ్యాంకుకు ఆమె సారథ్యం వహిస్తున్నారని బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ ప్రశంసించింది. రుణాల మాఫీ యత్నాలను విడిచిపెట్టాల్సిందిగా రాజకీయ నాయకులపై ఆమె ఒత్తిడి తెస్తున్నారనీ, మాఫీ చేస్తే రుణాలు చెల్లించే సంస్కృతి భ్రష్టుపడుతుందని చెబుతున్నారనీ పేర్కొంది.