
అవమానంతో తలదించుకుంటున్నా: భట్టాచార్య
దేశంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాల పట్ల భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు.
తిరువనంతపురం: దేశంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాల పట్ల భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనల గురించి చదివినప్పుడు అవమానంతో తలదించుకోవాల్సివస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, విద్యాపరమైన స్వావలంబనతోనే మహిళలపై నేరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
మహిళలపై పెరుగుతున్న నేరాలు అంతర్జాతీయ యవనికపై భారత సాంస్కృతిక ముఖచిత్రానికి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై హింసను కేంద్రంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం నిరోధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో ప్రభుత్వ పాఠశాల బాలికలకు గురువారం అరుంధతీ భట్టాచార్య కంప్యూటర్లు పంపిణీ చేశారు.