
మొండిబకాయిలు నేరం కాదు
జంషెడ్‌పూర్: మొండిబకాయిలను నేరంగా పరిగణించనక్కర్లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సీఎండీ అరుంధతి భట్టాచార్య శనివారం జంషెడ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు.
వాటిని సరైన సమయం లో గుర్తించి, నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎకానమీ మందగమనంలో ఉన్నప్పుడు ఎన్‌పీఏ సమస్య తప్పదని, ఆర్థిక పరిస్థితులు మెరుగైన కొద్దీ ఇవి అదుపులోకి రాగలవని తెలిపారు.