Infosys Q1 results: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్లతో పోలిస్తే లాభాలు 10.9 ఎగిసాయి. అయితే, రూ. 6,141 కోట్ల లాభం సాధిస్తుందన్న ఎనలిస్టుల అంచనాలనుమిస్ చేసింది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో)
స్థిరమైన కరెన్సీ (CC) పరంగా, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ. 37,933 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 20.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. త్రైమాసికంలో దీని అట్రిషన్ 17.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాది కంపెనీ ఆదాయ మార్గదర్శకాన్ని 1 శాతం- 3.5 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతంగా ఉంచింది. (మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్)
క్యాస్ట్ ఆప్టిమైజేషన్‌పై తమ దృష్టి నేపథ్యంలో అనిశ్చిత స్థూల వాతావరణంలో క్యూ1లో ఆపరేటింగ్ మార్జిన్‌లు నిలకడగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. 4.2 శాతం పటిష్టమైన Q1 వృద్ధిపట్ట ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ సంతృప్తిని వ్యక్తం చేశారు . భారీ ఒప్పందాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇదే భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని వేస్తుందన్నారు. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం)
ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
Comments
Please login to add a commentAdd a comment