సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ఆదాయ అంచనాల్లో(గైడెన్స్‌లో) నిరాశపరిచింది. నేడు ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ 2018 ఆర్థిక సంవత్సరపు గైడెన్స్‌ను 6.5-8.5 శాతం నుంచి 5.5-6.5 శాతానికి తగ్గించింది. కంపెనీ లాభాల్లో ఏడాది ఏడాదికి 7 శాతం పెరిగి రూ.3726 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రిపోర్టు చేసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.3,606 కోట్లగా ఉన్నాయి.
సీక్వెన్షియల్ బేసిస్‌గా కంపెనీ ప్రాఫిట్ 3.4 శాతం పెరిగింది. ఇన్ఫీ చైర్మన్‌గా నందన్ నిలేకని పునరాగమనంతో తర్వాత విడుదలైన తొలి క్వార్టర్లీ ఫలితాలు ఇవే. డాలర్ లెక్కలో ఈ కంపెనీ రెవెన్యూలు సీక్వెన్షియల్‌గా 2.9 శాతం పెరిగాయి. రూ.17,078 కోట్లగా ఉన్న రెవెన్యూలు రూ.17,567 కోట్లగా ఉన్నాయి. అదేవిధంగా స్థిర కరెన్సీ విలువల్లో క్వార్టర్ క్వార్టర్‌కు రెవెన్యూ వృద్ధి 5.4 శాతంగా ఉంది. ఈ క్వార్టర్‌లో కంపెనీ మార్జిన్లు 24.2 శాతం పెరిగాయి. ఒక్కో షేరుకు రూ.13 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment