సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన 10.3శాతం లాభాల వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6-8శాతం వుంటుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది.
మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో ఎనలిస్టులు అంచనాలకు మించి ఈ ఆర్థికసంవత్సరం రెండవ త్రైమాసికంలో రూ. 4,110 కోట్ల నికర లాభాలాను సాధించింది. ఆదాయం 17.30 శాత ఎగిసి 20,609 కోట్ల రూపాయలను సాధించింది. కఆపరేటింగ్ మార్జిన్లు 23.7శాతంగా ఉన్నాయి.
డివిడెండ్: అలాగే ప్రతి ఈక్విటీ షేరుకు 7రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. అక్టోబరు 30 తరువాత డివిడెండ్ చెల్లింపు ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment