సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 20శాతం పెరిగి 6,658.62 కోట్ల రూపాయలను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 5,568 కోట్లను సాధించింది. బ్యాంక్ నికర ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 18,265 రూపాయలతో పోలిస్తే ప్రస్తుతం 19,740.7 కోట్లకు పెరిగింది.
శనివారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో నికర వడ్డీ ఆదాయం 17.8 శాతం పెరిగి 15,665 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు దాదాపు 49 శాతం పెరిగి3,891.5 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,614 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. డిపాజిట్లు 24.6 శాతం పుంజుకుని ఈ ఏడాది జూన్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు 1,189,387 కోట్లుగా ఉన్నాయి.అలాగే మొత్తం అడ్వాన్సులు 1,003,299 కోట్లుగా ఉండగా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20.9 శాతం వృద్దిని సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment