సాక్షి, ముంబై : ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్‌డీఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాల్లో అదర గొట్టింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో 46 శాతంగా ఎగిసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 3203 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 46 శాతం అధికం కాగా.. మొత్తం ఆదాయం 31 శాతం వృద్ధితో రూ. 12996 కోట్లను తాకింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 9,951.98 కోట్ల రూపాయలుగా ఉందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ. 3130 కోట్లకు చేరగా.. పెట్టుబడుల(గృహ ఫైనాన్స్) విక్రయంపై రూ. 1894 కోట్ల లాభం ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం లాభంతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment