న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్‌గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్‌లో 5 శాతం ఎగిసింది.
అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్‌డౌన్‌లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి.
మోటారు సైకిళ్ల విక్రయాలు 3.06 లక్షల యూనిట్ల నుంచి 4.34 లక్షల యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 1.38 లక్షల నుంచి 3.06 లక్షల యూనిట్లకు చేరాయి. 2.96 లక్షల యూనిట్ల ద్వచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఎన్‌సీడీలను ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment