
29.84 లక్షల షేర్లు కొనుగోలు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్‌డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.
షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్‌డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్‌చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం!