న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 1,093 కోట్లను తాకింది. వివిధ ప్రాంతాలలో అమ్మకాలు పుంజుకోవడం లాభాలకు దోహదపడింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 726 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 8,300 కోట్ల నుంచి రూ. 10,031 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 18 శాతం అధికంగా 14.6 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ శత జయంతి సందర్భంగా రూ. 25 ప్రత్యేక డివిడెండుతో కలిపి వాటాదారులకు కంపెనీ బోర్డు మొత్తం షేరుకి రూ. 100 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. రూ. 600 కోట్లు వెచి్చంచడం ద్వారా విడిభాగాలు, యాక్సెసరీస్, మెర్కండైజ్ బిజినెస్‌ను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తాజాగా వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో హీరో మోటోకార్ప్ షేరు 2 శాతం లాభంతో రూ. 4,909 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment