టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..! | Tesla Sold 241300 Cars In The Third Quarter While Other Automakers Saw Big Drops | Sakshi
Sakshi News home page

Tesla: టెస్లా జోరు.. మిగతా కంపెనీల బేజారు..!

Published Sun, Oct 3 2021 3:56 PM | Last Updated on Sun, Oct 3 2021 4:02 PM

Tesla Sold 241300 Cars In The Third Quarter While Other Automakers Saw Big Drops - Sakshi

ఎలన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ టెస్లా అమ్మకాల్లో సరికొత్త రికార్డును నమోదుచేసింది.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కార్‌ కంపెనీలు చిప్‌ కొరతతో సతమతమౌతుంటే టెస్లా దానిని అధిగమించి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది.  ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు  241,300 కార్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జరిపిన అమ్మకాల కంటే లక్షకుపైగా కార్లను టెస్లా విక్రయించింది. 2019 సంవత్సరంలో టెస్లా మొత్తంగా 367500 కార్ల సేల్స్‌ను జరిపింది. 
చదవండి: ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంత వస్తుందో ఇలా చెక్‌ చేయండి..!

గత త్రైమాసికంలో ప్రధాన కార్ల  తయారీదారులు అమ్మకాల రేటు గణనీయంగా పడిపోయింది.టెస్లాకు చైనాలో బలమైన మార్కెట్‌ అమ్మకాలను గణనీయంగా పెరగడానికి దోహదపడింది.  అమెరికన్‌ దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ జనరల్‌మోటార్స్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 446,997 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 33 శాతం తగ్గాయి.
చదవండి: ‎టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement