క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు! | Mobile handset shipment to cross 75 million in Q3: CMR | Sakshi
Sakshi News home page

క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!

Published Thu, Aug 25 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!

క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!

సీఎంఆర్ అంచనా
న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ3) మొబైల్ హ్యాండ్‌సెట్స్ విక్రయాలు 7.5 కోట్ల యూనిట్లుగా ఉండొచ్చని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ అంచనా వేసింది. పండుగల సీజన్, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలు వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు దోహదపడొచ్చని తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ (క్యూ2)లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 6.59 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 24% వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా 3.73 కోట్లుగా, స్మార్ట్‌ఫోన్స్ వాటా 2.87 కోట్లుగా ఉందని తెలిపింది.

శాంసంగ్ టాప్: క్యూ2లో మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్‌లో 25.5% వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది. దీని వాటా స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 29.7%, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 22.3% ఉందని సీఎంఆర్ పేర్కొంది. ఇక 13.6% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 14.8% వాటాను, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 12.6 శాతం వాటాను ఆక్రమించింది. మైక్రోమ్యాక్స్ తర్వాతి స్థానాల్లో ఇంటెక్స్ (10.4 %), కార్బన్ (9.6 శాతం), లావా (8 శాతం) ఉన్నాయి.

పీసీ విక్రయాలు 2% డౌన్
న్యూఢిల్లీ: దేశంలో పీసీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.2 శాతం తగ్గుదలతో 21.4 లక్షల యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో పీసీ అమ్మకాలు 21.9 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో పీసీ విక్రయాలు 7.2 శాతంమేర ఎగశాయి. కాగా, పీసీ మార్కెట్‌లో హెచ్‌పీ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 28.4 శాతంగా ఉంది. ఇక దీని తర్వాత స్థానాల్లో డెల్ (22.2 శాతం), లెనొవొ (16.1 శాతం), ఏసర్ (14 శాతం) ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement