కమీషన్ల కోసం కపట నాటకం! | Meeting with traders on release of CMR dues | Sakshi
Sakshi News home page

కమీషన్ల కోసం కపట నాటకం!

Published Wed, Nov 27 2024 5:31 AM | Last Updated on Wed, Nov 27 2024 5:31 AM

Meeting with traders on release of CMR dues

కాకినాడ కేంద్రంగా నాడు కూటమి పెద్దల హైడ్రామా 

భారీగా పీడీఎస్‌ బియ్యం దొరికాయని హడావుడి 

సీఎంఆర్‌ బకాయిల విడుదలపై వ్యాపారులతో భేటీ 

10 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసిన ఓ అమాత్యుడు 

మధ్యవర్తిత్వంతో 8 శాతం కమీషన్‌కు సమ్మతి 

తొలి విడతగా రూ.200 కోట్లు విడుదల 

ఒప్పందం మేరకు రూ.16 కోట్ల కమీషన్‌ వసూళ్లకు శ్రీకారం 

సీజ్‌ చేసిన 48 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం విడుదల  

ఈ దందా కోసమే నాడు అవాకులు చెవాకులు! 

సాక్షిప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో కమీషన్‌ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగిపోతోందని కూటమి సారథులు చెబుతోన్న మాటలకు, వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇసుక, మద్యం దందా.. దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారా­లు, దాడులతో రెచ్చిపోతుండటాన్ని సుపరిపాలనగా చెప్పుకుంటున్నారు. అన్నింట్లోనూ కమీషన్‌ల కక్కుర్తితో జేబులు నింపుకుంటోన్న పెద్దలు ఇప్పుడు రైస్‌ మిల్లర్ల పొట్ట కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారు. 

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల విడుదల కోసం కమీషన్‌ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. డిసెంబర్‌ మొదటి వారం నాటికి సదరు మంత్రి అడిగిన మేరకు వసూళ్లు పూర్తి చేసి అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. గత నెలలో కాకినాడ కేంద్రంగా జరిగిన రైస్‌ మిల్లింగ్‌ రంగ ప్రముఖల భేటీలో ఈ మేరకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సాగింది. 

నాడు జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్‌ బకాయిల కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు 8 శాతం కమీషన్‌ వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు కమీషన్‌గా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోíÙంచాలో.. భారీగా కమీషన్‌ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ అసలు సంగతి.. 
» ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్‌లో కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ చేసేందుకు అనుమతిస్తుంటుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్‌కు ముందు జరిగేదే. ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం పరిపాటి. అలా ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లు బకాయి పడింది. 

»  సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వం గద్దె నెక్కడంతో సీఎంఆర్‌ బకాయిల విడుదల కోసం మిల్లర్లు కూటమిలోని పెద్దల వద్ద లాబీయింగ్‌ చేశారు. బకాయిలు రూ.200 కోట్లు వంతున దశల వారీగా విడుదల చేయాలని పలువురు ప్రతిపాదించారు. 

»  ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌ లక్ష్యం 37 లక్షల టన్నులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 20 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు వినియోగిస్తే మిగిలిన 60 లక్షల టన్నులు కస్టమ్‌‡ మిల్లింగ్‌కు ఇవ్వాలని మిల్లర్లు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 

»   రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మిల్లులపై ఆధార పడ్డ వేలాది మంది లారీ, జట్టు, ప్యాకింగ్‌ కారి్మకులకు ఉపాధి లభిస్తుందని మిల్లర్లు కోరుతున్నారు. ఈ అంశంతో పాటు రైస్‌ మిల్లుల రాష్ట్ర కార్యవర్గంలో మార్పులపై ఆ రంగ ప్రముఖులు ఇటీవల కాకినాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిలు మొత్తంగా సుమారు రూ.1600 కోట్ల విషయం చర్చకు వచ్చింది. 

ఖరీఫ్‌ సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌లో ధాన్యం సేకరణ జరగాలంటే బకాయిలు విడుదల చేయాల్సిందేనని మిల్లర్లు పట్టుబట్టారు. మొత్తం బకాయిలు ఇప్పటికిప్పుడు ఒకేసారి విడుదల చేసే పరిస్థితులు లేవని తేల్చారు. రూ.200 కోట్ల వంతున విడుదల చేయించేందుకు ఒక మంత్రి తరఫున కొందరు నాటి సమావేశంలో వకాల్తా పుచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

»   మొదటి విడత విడుదల అనుకున్నట్టు జరగాలంటే విడుదల చేసే బకాయి మొత్తంలో 10 శాతం కమీషన్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. బకాయిలు పెరిగి పోయి మిల్లుల నిర్వహణ సవాల్‌గా మారిందని అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు 8 శాతానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరికీ చిల్లి గవ్వ కమీషన్‌ ఇవ్వలేదని కొందరు విబేధించినా, చివరకు వారు కూడా మెజార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోయారని తెలిసింది.   

పథకం ప్రకారం ఎగుమతులపై విష ప్రచారం  
»   ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలి పోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ 
కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బ తీశారని మిల్లింగ్‌ రంగంలో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లలో కోటి 47 లక్షల 55 వేల 837 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమీషన్‌ కోసమే ఇంత చౌక బారుగా వ్యవహరిస్తారా? అని విస్తుపోతున్నారు. 

»   రెండు తరాలుగా రైస్‌ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన మిల్లర్లే లక్ష్యంగా కూటమి నేతలు  రైస్‌ మిల్లులు, గోడౌన్‌లపై వరుస దాడులు చేయించారు. తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలను నమ్మించేందుకు పీడీఎస్‌ బియ్యంగా సుమారు 48 వేల మెట్రిక్‌ టన్నులు ప్రభుత్వం సీజ్‌ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రెండు రోజులు కాకినాడలో మకాం వేసి.. మిల్లులు, గోడౌన్‌లపై దాడులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. 

ఇంతా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారనే విమర్శలొచ్చాయి. సీజ్‌ చేసిన బియ్యంలో పీడీఎస్‌ లేదనే నిర్ధారణతో 70 శాతం బియ్యాన్ని దశల వారీగా విడుదల చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీజ్‌ చేసిన మిగిలిన బియ్యంపై 6ఎ కేసులకే పరిమితమయ్యారు. కూటమి పెద్దల ఇంత హడావుడి వెనుక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనని తేలిపోయిందని జనం విస్తుపోతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement