ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు | ITC Q3 profit up 10.5%, slow cigarette growth hurts revenue | Sakshi
Sakshi News home page

ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు

Published Thu, Jan 22 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు

ఐటీసీ లాభం రూ. 2,635 కోట్లు

క్యూ3లో 10.5% పెరుగుదల
సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతే...

న్యూఢిల్లీ: బహుళ వ్యాపార రంగ దిగ్గజం ఐటీసీ.. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.2,635 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.2,385 కోట్లతో పోలిస్తే లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. అయితే, కంపెనీ ఆదాయం మాత్రం నామమాత్రంగా 2 శాతం పెరిగి రూ.8,800 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో ఆదాయం రూ.8,623 కోట్లుగా ఉంది. ప్రధానంగా సిగరెట్ల వ్యాపారంలో వృద్ధి అంతంతమాత్రంగా కొనసాగడం మొత్తం ఆదాయాల పెరుగుదలపై ప్రభావం చూపింది.

ఫలితాల్లో ముఖ్యాంశాలివీ...
* సిగరెట్లు, ఇతరత్రా ఎఫ్‌ఎంసీజీ విభాగాల నుంచి క్యూ3లో రూ.6,456 కోట్ల ఆదాయం కంపెనీకి సమకూరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 4.23% పెరిగింది. ఇందులో ఒక్క సిగరెట్ల విభాగం నుంచి రూ.4,142 కోట్ల ఆదాయం లభించింది. వృద్ధి 0.62%కి పరిమితమైంది.
* గతేడాది బడ్జెట్లో సిగరెట్లపై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు పూర్తి ప్రభావంతో పాటు.. తమిళనాడు, కేరళ, అసోంలు వ్యాట్‌ను పెంచడంతో ఈ విభాగం నుంచి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
* ఇక హోటళ్ల వ్యాపార ఆదాయం మూడో క్వార్టర్‌లో 4.69% పెరిగి రూ.330 కోట్లుగా నమోదైంది.
* అగ్రి బిజినెస్ ఆదాయం 10.55 శాతం దిగజారి రూ.1,598 కోట్లకు పరిమితమైంది.
* పేపర్ బోర్డులు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపార విభాగం ఆదాయం కూడా 4.66 శాతం క్షీణించి రూ.1,199 కోట్లకు తగ్గిపోయింది.
* ఆదాయాల్లో వృద్ధి మందగమనంతో ఐటీసీ షేరు కుప్పకూలింది. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 5.01%(రూ.18.60) క్షీణించి రూ.352.60 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement