న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.235 కోట్లకు పెరిగిందని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మ్యూచువల్ ఫండ్, బ్రోకింగ్ వ్యాపారాల్లో వృద్ధి కారణంగా నికర లాభంలో పెరుగుదల సాధించామని వివరించింది. మొత్తం ఆదాయం రూ.2,106 కోట్ల నుంచి రూ.2,318 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ బీఎస్‌ఈలో 1 శాతం క్షీణించి రూ.363 వద్ద ముగిసింది.
ఇండిగో లాభం 24 శాతం అప్
న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబల్ ఏవియేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఏడాది నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టైన ఈ కంపెనీ ఈ క్యూ3లో రూ.657 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, విమాన సర్వీసులు పెరగడం ప్రయాణికుల ఆదాయం పెరగడంతో మంచి నికర లాభం సాధించామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ చెప్పారు. గత క్యూ3లో రూ.3,939 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధి చెంది రూ.4,407 కోట్లకు పెరిగిందని వివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన తర్వాత ఈ కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇవి.
రిలయన్స్ క్యాపిటల్ లాభం 10 అప్
Published Fri, Jan 22 2016 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement