సాక్షి, న్యూఢిల్లీ: దేశీ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా నమోదైంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి 4.7 శాతంగా వుంది. మునుపటి త్రైమాసికంలో నమోదైన ఆరేళ్ల కనిష్టం 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 5.6 శాతంగా వుంది. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదైంది. అలాగే మూడవ త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 4.5 శాతంగా ఉంది, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని, భారత దేశాన్ని 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశలో తమ తాజా బడ్జెట్ పునాది వేసిందని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ‍్యంలోతాజా గణాంకాల్లో జీడీవీ వృద్ధి రేటు సుమారు 5 శాతంగా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment