marginal
-
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
స్వల్ప లాభాల్లో సూచీలు, అదానీ ట్విన్స్ షేర్లలో కొనుగోళ్ళ జోష్
సాక్షి,ముంబై: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు ఎగిసి 60710 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17 వేల 945 వద్ద కదలాడుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ విన్నర్స్‌గానూ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఏషియన్ పె యింట్స్ నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాలకు పరిమితం: ఆటో, రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి. టాటా మోటార్స్, విప్రో మరియు పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్‌లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది. -
Today StockMarket: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది. ఓఎన్జీసీ, టెక్‌మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్‌గా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది. -
ఆశాజనకంగా జీడీపీ వృద్ది 4.7 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా నమోదైంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి 4.7 శాతంగా వుంది. మునుపటి త్రైమాసికంలో నమోదైన ఆరేళ్ల కనిష్టం 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 5.6 శాతంగా వుంది. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదైంది. అలాగే మూడవ త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 4.5 శాతంగా ఉంది, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని, భారత దేశాన్ని 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశలో తమ తాజా బడ్జెట్ పునాది వేసిందని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలోతాజా గణాంకాల్లో జీడీవీ వృద్ధి రేటు సుమారు 5 శాతంగా ఉండటం విశేషం. -
లాభాల స్వీకరణ: ఏడు రోజుల లాభాలకు బ్రేక్
సాక్షి, ముంబై: ఫ్లాట్‌గాప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిసాయి. వరుస ఏడు రోజుల లాభాలకు చెక్ చెప్పిన కీలక సూచీలు ఒడిదొడుకుల మధ్య రోజంతా కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 150పాయింట్లకుపైగా పతనం కాగా,నిఫ్టీ 11900 స్థాయికి చేరింది. చివరికి సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 40248 వద్ద, నిఫ్టీ 24పాయింట్ల బలహీనంతో 11917 వద్ద ముగిసాయి. వరుసగా లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, మెటల్ బలపడగా.. మీడియా, ఐటీ నష్టపోయాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా రూ.87 కోట్ల షేర్లను కొనుగోలు చేయడంతో యస్ బ్యాంక్ 9 శాతం జంప్‌చేయగా.. ఎస్బీఐ, భారతి ఇన్ఫ్రాటెల్, టాటా మోటర్స్, వేదాంతా, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో లాభాలనార్జించాయి. జీ, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, గ్రాసిం, కోటక్ బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టైటన్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఐటీసీ నష్టపోయిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కార అంచనాలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలవడం విశేషం! -
భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివర్లో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఆరంభంలోనే సెంచరీ లాభాలనుసాధించిన కీలక సూచీ సెన్సెక్స్ ఆ తరువాత 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. తిరిగి అదే స్థాయిలో పుంజుకుని 360 పాయింట్లకు పైగా ఎగిసింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్యకొనసాగి చివరికి 87పాయింట్ల లాభంతో 38214 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభంతో 11341 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో భారీ ఊగిసలాట కనిపించింది. ఐటీ నష్టపోగా, దాదాపు అన్ని సెక్టార్లు నామమాత్రంగా లాభపడ్డాయి. ఐఆర్సీటీసీ స్టాక్ బంపర్ లిస్టింగ్‌తో భారీ లాభాలను నమోదు చేసింది. ఏకంగా 128 శాతం ఎగిసి రూ. 729 వద్ద ముగిసింది. అలాగే ఫ్రెంచ్ దిగ్గజం పెట్టుబడుల వార్తతో అదానీ గ్యాస్ 18శాతం లాభపడింది. వీటితోఆటు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, సన్ ఫార్మ, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, ఆటా స్టీల్, ఎంఅండ్ఎం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, యూపీఎల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. -
స్వల్ప లాభాలతో కదులుతున్న స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఆరంభంలో స్తబ్దుగా ఉన్న సూచీల్లో ఒక దశలో 100 పాయింట్లుగా పుంజుకున్న సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 34,411 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 10,323 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ లాభాలతోనూ, ఐటీ, మెటల్ స్వల్ప నష్టాలతోనూ కొనసాగుతున్నాయి. ఐబీ హౌసింగ్ భారీ లాభపడుతుండగా, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, గెయిల్, ఐషర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ ఇతర టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్, అల్ట్రాటెక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, ఐవోసీ, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోతున్నాయి. -
తెప్పరిల్లుతున్న రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టాలనుంచి స్వల్పంగా కోలుకుంది. రోజుకో కొత్త కనిష్టాన్ని తాకుతున్న రూపాయి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త కోలుకుంది. వరుసగా అయిదురోజుల రికార్డు పతనం ముఖ్యంగా మంగళవారం నాటి చరిత్రాత్మక కనిష్టం నుంచి పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో18 పైసలు(0.25 శాతం) బలపడి 71.40 వద్ద మొదలైంది. ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.51 వద్ద ట్రేడవుతోంది. కాగా మంగళవారం ఆరంభంలో రూపాయి కొద్దిగా కోలుకున్నా చివరికి 37 పైసలు(0.5 శాతం) పతనమై రికార్డు కనిష్టం 71.58 వద్ద ముగిసింది. వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతుండటం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు విశ్లేషించాయి. మరి బుధవారం వరుస నష్టాలనుంచి తెప్పరిల్లుతుందా, లేక ముగింపులో ఎనలిస్టులు భయపడుతున్నట్టుగా మరింత పతనమవుతుందా అనేది కీలకం. -
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి. దాదాపు100పాయింట్లకుపైగా పతనమైన కీలక సూచీలు ఆరంభ నష్టాలనుంచి చివర్లో పుంజుకుని స్వల్ప నష్టాలతో పటిష్టంగా ముగిశాయి. ముఖ్యంగా ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టు ముగింపునేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ 38700వ స్థాయిని, నిఫ్టీ 11700 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టంతో 38,690 వద్ద నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 11,677 వద్ద ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 1.2 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ 0.7 శాతం ఎగశాయి. ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో స్వల్ప నష్టపోయాయి. సన్ పార్మా, గెయిల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, యూపీఎల్, ఐటీసీ, ఎయిర్టెల్, హిందాల్కో, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ లాభపడగా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, ఇండస్ఇండ్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, యస్‌బ్యాంక్ నష్టపోయాయి. -
స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికార్డు స్తాయిలనుంచి వరుసగా రెండో రోజు కూడా వెనక్కి తక్కిన సెన్సెక్స్ ప్రస్తుతం 56 పాయింట్లు క్షీణించి 38,666కు చేరగా, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11,666 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నారని నిపుణులు భావిస్తున్నారు.పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్ నష్టాల్లో ఉండగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా నామమాత్రపులాభాల్లోకొనసాగుతున్నాయి. ఎయిర్టెల్, యూపీఎల్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, జీ లాభాల్లోనూ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, యాక్సిస్, ఆర్ఐఎల్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అటు చైనా,ఇటు అమెరికా16బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా విధించిన టారిఫ్‌లు అమలుకానున్న నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే నష్టాలనుంచి దేశీయ మార్కెట్లు పుంజుకుని స్వల్ప లాభాలతో కొనసాగు తున్నాయి. సెన్సెక్స్ 82 పాయింట్లుఎగిసి 88,418 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,601వద్ద ప్రధాన మద్దతుస్థాయికి పైన ఉంది. క్రయ విక్రయాల మధ్య సూచీలు ఊగిసలాటకు గురవుతూ వీకెండ్లో స్తబ్దుగా ఉన్నాయి. బ్యాంకింగ్, మెటల్స్, ఆటో షేర్లు లాభపతుండగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా నష్టపోతున్నాయి. టాటా స్టీల్, ఆక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. లుపిన్, సిప్లా, ఐసీఐసీఐ, ఎయిర్టెల్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హెక్సావేర్ నష్టపోతున్నాయి. హెక్సావేర్ కంపెనీకి చెందిన ప్రధాన ఇన్వెస్టర్ భారీ ఎత్తున షేర్లను విక్రయించడంతో ఈ షేర్ 14.5 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది. -
స్వల్పంగా తగ్గిన డబ్ల్యూపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత సూచీ( డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం జూలైనెలలో దిగి వచ్చింది. జూన్ లో నాలుగేళ్ల గరిష్టాన్ని తాకిన డబ్ల్యుపీఐ స్వల్పంగా పుంజుకుంది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో 5.09శాతంగా నమోదైంది. కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గు ముఖంపట్టడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి దిగివచ్చింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.77 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో (2017 జూలైలో) ద్రవ్యోల్బణం రేటు 1.88 శాతంగా ఉంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలకుగాను 4.17 శాతంగా నమోదైంది. ఇది 9నెలల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. కూరగాయలు, పళ్ల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. 2018 జూన్‌లో కూరగాయల ధరలు 7.8 శాతం పెరగ్గా, జూలైలో 2.19 శాతం క్షీణించాయి. -
వేదాంతా లాభాలు ఓకే
సాక్షి, ముంబై: మెటల్, మైనింగ్ దిగ్గజం వేదాంత క్యూ1 ఫలితాల్లో పరవాలేదనిపించింది. మొదటి త్రైమాసికంలో నికర లాభంలో స్వల్ప ( 0.7 శాతం) వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2233 కోట్లతో పోలిస్తే తాజాగా రూ. 2248 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 21.4 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.22,206 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎబిటా 28.4 శాతం - రూ.6284 కోట్లగా ఉంది. తమిళనాడులో ప్లాంటును ఆందోళన కారణంగా మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని తెరిపించేందుకు ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్టు వేదాంతా ఛైర్మన్ అనిల్‌అగర్వాల్ ప్రకటించారు. తద్వారా 100 మిలియన్ డాలర్లను నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. అయితే అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ జింక్ గణనీయమైన ఉత్పత్తితో ఈ లాభాలను సాధించినట్టు సీఈవో కుల్దీప్ కూరా ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించారు. ప్రాజెక్టులు పురోభివృద్ధితో రాబోయే క్వార్టర్లలో మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నామని చెప్పారు. కాగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎబిటా - రూ.852 కోట్లు, ఐరన్ అండ్ ఓర్ ఎబిటా రూ.163 కోట్లు, అల్యూమినియం ఎబిటా రూ.1259 కోట్లు, పవర్ ఎబిటా రూ.425 కోట్లుగా నమోదు చేసింది. -
స్వల్ప లాభాల్లో మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా మొదలైనాయి. రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న కీలకసూచీ సెన్సెక్స్ తాజాగా కొత్త గరిష్టాన్ని అందుకుంది. బుధవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,928 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్26 పాయింట్ల లాభంతో 36,851 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు ఎగిసి 11, 139 వద్ద కొనసాగినా, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ పుంజుకోగా, ఐటీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, భారతి ఎయిర్టెల్ టాప్‌లూజర్స్‌గా ఉన్నాయి. అలాగే ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ కౌంటర్ కూడా భారీగా నష్టపోతోంది. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ టాప్ విన్నర్స్ ఉన్నాయి. అటు కరెన్సీ మార్కెట్లో దేశీయ కరెన్సీ రుపీ బలహీనంగా మొదలైంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. ట్రంప్-కిమ్ భేటీ సానుకూల ఫలితాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందించారు. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పుంజుకున్న కీలక సూచీ 69 పాయింట్లు పుంజుకుని, నిఫ్టీ 25 పాయింట్ల ఎగిసి 10800కి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రధానంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారీ లాభాలతో వక్రంగీ అప్పర్ సర్క్యూట్ అయింది. ఐవోసీ, బీపీసీఎల్ డాక్టర్ రెడ్డీస్, సిప్లా, విప్రో, లుపిన్, ఐవోసీ, అదానీ పోర్ట్స్,టాటా మోటార్స్, కెనరాబ్యాంకు బీజీఆర్ ఎనర్జీ, లాభపడుతుండగా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హిందాల్కో, వేదాంతా తదితర షేర్లు నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాల ముగింపు: అయినా ఒకే
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో అక్కడికక్కడే ముగిశాయి. ఆరంభంలో సెంచరీ లాభాలతో మురిపించినా, మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య కన్సాలిడేట్ అయిన కీలక సూచీలు చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ కూడా కేవలం పాయింట్లు పెరిగి 10,718 వద్ద ముగిసింది. అయితే కీలక మద్దతు స్తాయిలకు పైన నిలవడం సానుకూల సంకేతం. బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ లాభపడగా, ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ రంగాలు నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, ఐషర్, బీపీసీఎల్, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, యాక్సిస్, ఐవోసీ, గ్రాసిమ్, ఎయిర్టెల్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. మరోవై పు సోమవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో 45శాతం నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంకు నేడు దాదాపు 7 శాతం పుంజుకోవడం విశేషం. ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, జీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, యస్‌బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, వేదాంతా నష్టపోయాయి. అటు కరెన్సీ మార్కెట్లో రుపీ బలహీన ధోరణికొనసాగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. 120 రూపాయలు క్షీణించి 31, 138 వద్ద ఉంది. -
స్వల్ప లాభాలే: టీసీఎస్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు ఎక్కడ మొదలయ్యాయో దాదాపు అక్కడే ముగిశాయి. మిడ్‌సెషన్‌లో దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీలు చివర్లో ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్లను లీడ్ చేశాయి. టీసీఎస్ మూడు రోజుల లాభాలు, రికార్డు హై నుంచి దిగజారి ముగింపులో 4శాతం పడిపోయింది. అయితే బ్యాంకింగ్ , ఫార్మా సెక్టార్ బాగా పుంజకుంది. దీంతో డే హైనుంచి 200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 35పాయింట్లు లాభంతో 34450వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 10600వకు దిగువన 10,584 వద్ద ముగిసింది. హిందాల్కో, ఇండియాబుల్స్ హౌసింగ్, యూపీఎల్, గ్రాసిం, వేదాంతా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అరబిందో, క్యాడిలా, సన్‌ఫార్మ హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఎస్బీఐ, ఇండస్ ఇండ్, ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోకూడా బలహీనపడింది. 0.35 పైసలు నష్టపోయి 66.46 స్థాయికి చేరింది. -
స్వల్ప లాభాల్లో కీలక సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్ ఉన్నప్పటికీ మన ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. అయితే పీఎస్‌యూ బ్యాంకింగ్ సెక్టార్లో వీక్నెస్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో, నిఫ్టీ9 పాయింట్ల లాభంతో మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్వల్ప నష్టాల్లోకి మళ్లాయి. లాభనష్టాల మధ్య ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని , బ్యాంక్ నిఫ్టీని గమనించాల్సి ఉందని ఎనలిస్టుల విశ్లేషణ. మెటల్, ఆటో రంగాలు లాభపడుతుండగా , ఐటీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎస్బీఐ, వర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, సిప్లా , ఇండియా బుల్స్ వెంచర్స్, టాటా మోటార్స్ హిందాల్కో, నాల్కో, అపోలో టైర్స్, ఐడియా, ఎంఅండ్ఎం, లుపిన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐవోసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్ లాభపడుతుండగా, ఎస్‌బ్యాంక్, ఫోర్టిస్, హెచ్‌పీసీఎల్,ఇన్ఫోసిస్, యాక్సిస్, గ్రాసిమ్, విప్రో, జీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతీ, ఇన్ఫ్రాటెల్, టైటన్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు టైర్ షేర్లలాభపడుతున్నాయి. ముఖ్యంగా టైర్ సెక్టార్ దిగ్గజం ఎంఆర్‌ఆఫ్ మరోసారి రికార్డ్ స్థాయిని తాకింది. -
ట్రేడ్ వార్ భయం: ఫ్లాట్ ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు స్వల్ప లాభాలతో పాజిటివ్ నోట్ తో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 33,637 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 10331 వద్ద ముగిశాయి. మిడ్‌క్యాప్, బ్యాంక్ నిఫ్టీకూడా గ్రీన్‌లోనే ముగిశాయి. చైనా- అమెరికా ట్రేడ్‌వార్ ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. మరోవైపు ఈ సాయంత్రం మరో ఆసక్తికర ప్రకటనకు చైనా సిద్ధమవుతోంది.లుపిన్, బీపీసీఎల్, టైటన్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్ , మారుతి సుజుకి, టెక్ మహీంద్ర, ఎంఫసిస్, పిరామిల్, జూబ్లియంట్, ఫెడరల్ బ్యాంక్ లాభపడగా, వక్రంగీ, ఐడియా, అదానీ, భారతీ, వేదాంతా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ఆటో, అల్ట్రాటెక్, విప్రో, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం,బజాజ్ ఆటో, ఎల్అండ్టీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 56 పాయింట్లు పుంజుకుని 34239 వద్ద నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో10,514 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ, ఆటో కౌంటర్లకు కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి అలాగే కొనసాగుతోంది. అటు ఐటీ కూడా నష్టాలోల్లోనే. అయితే ఆటో సేల్స్ గణాంకాలు మెరుగ్గా వుండటంతో ఆటో సెక్టార్, ఇంకా ఫార్మా లాభపడుతోంది. బజాజ్ ఆటో, సిప్లా, సన్‌ఫార్మా, భారతి ఇన్ఫ్రాటెల్, టీసీఎస్ లాభాల్లోనూ , వేదాంతా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో , యాక్స్ బ్యాంక్ , ఎస్బీఐ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. -
ఐటీలో కొత్తగా లక్ష ఉద్యోగాలు -నాస్కామ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్‌గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగం నిలవగా ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్ బిజినెస్1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధిని కొనసాగిస్తుందని చెప్పింది. కాగా గత జూన్‌లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి.