
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. రికార్డు స్తాయిలనుంచి వరుసగా రెండో రోజు కూడా వెనక్కి తక్కిన సెన్సెక్స్ ప్రస్తుతం 56 పాయింట్లు క్షీణించి 38,666కు చేరగా, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11,666 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నారని నిపుణులు భావిస్తున్నారు.పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్ నష్టాల్లో ఉండగా ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా నామమాత్రపులాభాల్లోకొనసాగుతున్నాయి. ఎయిర్‌టెల్, యూపీఎల్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, జీ లాభాల్లోనూ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, యాక్సిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ నష్టపోతున్నాయి.