సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి.
టాటా మోటార్స్, విప్రో మరియు పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్‌లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment