సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది.
ఓఎన్‌జీసీ, టెక్‌మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్‌గా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment