
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివర్లో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఆరంభంలోనే సెంచరీ లాభాలనుసాధించిన కీలక సూచీ సెన్సెక్స్ ఆ తరువాత 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. తిరిగి అదే స్థాయిలో పుంజుకుని 360 పాయింట్లకు పైగా ఎగిసింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్యకొనసాగి చివరికి 87పాయింట్ల లాభంతో 38214 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభంతో 11341 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో భారీ ఊగిసలాట కనిపించింది. ఐటీ నష్టపోగా, దాదాపు అన్ని సెక్టార్లు నామమాత్రంగా లాభపడ్డాయి.
ఐఆర్‌సీటీసీ స్టాక్ బంపర్ లిస్టింగ్‌తో భారీ లాభాలను నమోదు చేసింది. ఏకంగా 128 శాతం ఎగిసి రూ. 729 వద్ద ముగిసింది. అలాగే ఫ్రెంచ్ దిగ్గజం పెట్టుబడుల వార్తతో అదానీ గ్యాస్ 18శాతం లాభపడింది. వీటితోఆటు ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మ, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, ఆటా స్టీల్, ఎంఅండ్‌ఎం లాభపడ్డాయి. మరోవైపు ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, యూపీఎల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment