
సాక్షి,ముంబై: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు ఎగిసి 60710 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17 వేల 945 వద్ద కదలాడుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ విన్నర్స్‌గానూ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, ఏషియన్ పె యింట్స్ నష్టపోతున్నాయి.