
యాక్సిస్ బ్యాంక్ రుణ రేటు తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూడవ బ్యాంకింగ్ దిగ్గజం- యాక్సిస్ బ్యాంక్ పలు కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 0.15 శాతం నుంచి 0.20 శాతం శ్రేణిలో తగ్గించింది. శుక్రవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఏడాది వరకూ అన్ని కాలపరిమితులపై రుణ రేటును 15 బేసిస్ పారుుంట్లు (లేదా 0.15 శాతం) తగ్గించడం జరిగింది. రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించిన కాలపరిమితులపై రేటు 20 బేసిస్ పారుుంట్లు తగ్గింది. దీనిప్రకారం.. ఓవర్‌నైట్ కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ రేటు 8.65 శాతం. నెలకు సంబంధించి రేటు 8.70 శాతం. మూడు, ఆరు నెలల రేటు వరుసగా 8.90 శాతం 9 శాతంగా ఉంది. ఏడాది కాలాలనికి ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతం అని బ్యాంక్ పేర్కొంది.