![stockmarkets opens with marginal losses - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/13/marlet%20flatnote.jpg.webp?itok=y2s0Mepd)
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో మంగళవారం నాటి బలహీన ధోరణి నేడు కూడాకొనసాగుతోంది. సెన్సెక్స్ 73 పాయింట్ల నష్టంతో 33,154 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 10,216 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకు టాప్ లూజర్ సెక్టార్‌గా ఉంది. రియల్టీ మెటల్స్, ఫార్మా లాభాల్లో ఉంది. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత కొనసాగుతోందని నిపుణులు విశ్లేషణ.
భారతి ఎయిర్‌టెల్, డా. రెడ్డీస్ , లుపిన్, గ్లెన్‌మార్క్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, అరబిందో , డిష్ టీవీ, లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, సెంచురీ టెక్స్‌టైల్, బాటా, కార్పోరేషనన్ బ్యాంక్, ఎస్‌బీఐ,, వేదాంతా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, సన్ ఫార్మ, అదానీ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment