మూడు ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి! | Congress candidate wins by margin of 3 votes | Sakshi
Sakshi News home page

మూడు ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి!

Published Sun, Oct 19 2014 2:30 PM | Last Updated on Tue, Oct 9 2018 2:28 PM

జై తిరథ్ దహియా - Sakshi

జై తిరథ్ దహియా

చండీఘర్: హర్యానాలో సోనెపట్ జిల్లాలోని రాయ్ శాసనసభ నియోజకవర్గంలో ఇద్దరు వృద్ధుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. పోటీ ఏ స్థాయిలో జరిగిందంటే,  62 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే  జై తిరథ్ దహియా కేవలం మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  తన సమీప ప్రత్యర్థి 68 ఏళ్ల ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎన్డి)ఇంద్రజిత్ దహియాపై ఆయన గెలుపొందారు.

ఎన్నిక ల అధికారులు ప్రకటించిన ప్రకారం  జై తిరథ్ దహియాకు 36,703 ఓట్లు, 68 ఏళ్ల ఇంద్రజిత్ దహియాకు  36,700 ఓట్లు వచ్చాయి. మూడవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కృష్ణ గేహ్లవాట్కు 34,523 ఓట్లు పోలయ్యాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement