న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్‌ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment