సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అటు చైనా,ఇటు అమెరికా16బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా విధించిన టారిఫ్‌లు అమలుకానున్న నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే నష్టాలనుంచి దేశీయ మార్కెట్లు పుంజుకుని స్వల్ప లాభాలతో కొనసాగు తున్నాయి. సెన్సెక్స్ 82 పాయింట్లుఎగిసి 88,418 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,601వద్ద ప్రధాన మద్దతుస్థాయికి పైన ఉంది. క్రయ విక్రయాల మధ్య సూచీలు ఊగిసలాటకు గురవుతూ వీకెండ్‌లో స్తబ్దుగా ఉన్నాయి. బ్యాంకింగ్, మెటల్స్, ఆటో షేర్లు లాభపతుండగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా నష్టపోతున్నాయి.
టాటా స్టీల్, ఆక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. లుపిన్, సిప్లా, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, హెక్సావేర్ నష్టపోతున్నాయి. హెక్సావేర్ కంపెనీకి చెందిన ప్రధాన ఇన్వెస్టర్ భారీ ఎత్తున షేర్లను విక్రయించడంతో ఈ షేర్ 14.5 శాతం మేర నష్టాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment