
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు ఎక్కడ మొదలయ్యాయో దాదాపు అక్కడే ముగిశాయి. మిడ్‌సెషన్‌లో దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన కీలక సూచీలు చివర్లో ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్లను లీడ్ చేశాయి. టీసీఎస్ మూడు రోజుల లాభాలు, రికార్డు హై నుంచి దిగజారి ముగింపులో 4శాతం పడిపోయింది. అయితే బ్యాంకింగ్ , ఫార్మా సెక్టార్ బాగా పుంజకుంది. దీంతో డే హైనుంచి 200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 35పాయింట్లు లాభంతో 34450వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 10600వకు దిగువన 10,584 వద్ద ముగిసింది.
హిందాల్కో, ఇండియాబుల్స్ హౌసింగ్, యూపీఎల్, గ్రాసిం, వేదాంతా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అరబిందో, క్యాడిలా, సన్‌ఫార్మ హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్, ఎస్ బ్యాంక్, ఎం అండ్ ఎం లాభపడిన వాటిల్లో ఉన్నాయి.
అటు కరెన్సీ మార్కెట్‌లో రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోకూడా బలహీనపడింది. 0.35 పైసలు నష్టపోయి 66.46 స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment