సాక్షి, హైదరాబాద్: ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్‌గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస‍్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగం నిలవగా ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్ బిజినెస్1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధిని కొనసాగిస్తుందని చెప్పింది.
కాగా గత జూన్లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్‌మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment