
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 56 పాయింట్లు పుంజుకుని 34239 వద్ద నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో10,514 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ, ఆటో కౌంటర్లకు కొనుగోళ్ళ ధోరణి కనిపిస్తోంది. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి అలాగే కొనసాగుతోంది. అటు ఐటీ కూడా నష్టాలోల్లోనే.
అయితే ఆటో సేల్స్ గణాంకాలు మెరుగ్గా వుండటంతో ఆటో సెక్టార్, ఇంకా ఫార్మా లాభపడుతోంది. బజాజ్ ఆటో, సిప్లా, సన్‌ఫార్మా, భారతి ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్ లాభాల్లోనూ , వేదాంతా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో , యాక్స్ బ్యాంక్ , ఎస్‌బీఐ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment