బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి
ముంబై: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయిలకు పైన ఓపెన్ అయ్యి, స్థిరంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 49పాయింట్ల లాభంతో 28,025 దగ్గర, నిఫ్టీ 22పాయింట్ల లాభంతో 8,612దగ్గర మొదలయ్యాయి. అనంతరం బీఎస్ఈ సెన్సెక్స్ వంద పాయింట్లకుపైగా లాభపడింది. మంగళవారం నిరాశాజనక ఫలితాలను నమోదు చేసిన డా.రెడ్డీ ల్యాబ్స్ భారీగా నష్టపోతోంది. ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే.. ఆసియా, యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. జీఎస్టీ బిల్లు, ఫెడ్ వడ్డీ రేట్ల తదితర అంశాలు మార్కెట్ ను ప్రభావితం చేయనున్నయాని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి డాలర్ తో పోలిస్తే పాజిటివ్ గా ఉంది.స్వల్పలాభంతో 0.10 పైసల లాభంతో 67.26 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ. 30,912 లుగా ఉంది.