ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 50415 వద్ద,నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 9390 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా నిఫ్టీ కీలకమైన 9400 స్థాయిని దిగవకు పడిపోయింది. దీంతో ఈ రోజుకూడా తీవ్ర ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్మా, ప్రభుత్వ బ్యాంక్ ఇండెక్సులు వరుసగా రెండో రోజు నెగిటివ్‌గా ఉండగా, ఐటీ , రియల్టీ, ఆటో రంగం స్వల్పంగా లాభాల్లో ఉన్నాయి. టాటా మెటార్స్ టాప్ గెయినర్‌గాను, టీసీఎస్, విప్రో గెయిల్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, సిప్లా, అరబిందో, బీవోబీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్‌పీఐలు అమ్మకాలవైపే మొగ్గు చూడం గమనార్హం.
అటు డాలర్‌మారకంలో రుపీ 0.30 పైసలు పతనమై రూ. 64.85 వద్ద బలహీనంగా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 33 లాభపడి రూ. 28,810 వద్ద ఉంది.
స్వల్ప లాభాలు: మార్కెట్ల లో ఒడిదుడుకులు, ఒత్తిడి
Published Wed, May 24 2017 9:31 AM | Last Updated on Tue, Oct 9 2018 2:28 PM
Advertisement
Advertisement