మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు | Another 4 government banks loan rate reduction | Sakshi
Sakshi News home page

మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు

Published Thu, Sep 7 2017 1:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:28 PM

మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు - Sakshi

మరో 4 ప్రభుత్వ బ్యాంకుల రుణ రేటు తగ్గింపు

ముంబై: కొత్త నెల ఆరంభం అయిన నేపథ్యంలో– తమ నిధుల లభ్యత వ్యయం ప్రాతిపదికన పలు బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను తగ్గిస్తున్నాయి. ఈ వరుసలో బుధవారం తాజాగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను 0.45 శాతం వరకూ తగ్గించాయి. బెంచ్‌ మార్క్‌ రేటు కోతతో అనుసంధానమైన గృహ, కారు ఇతర రుణాలు కొంత చౌక కానున్నాయి. రేట్ల తగ్గింపును బ్యాంకుల వారీగా చూస్తే...

పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌: ఓవర్‌నైట్‌ రేటు పరిమితి 0.45% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 8.15%కి తగ్గింది. నెలవారీ కాలపరిమితి రేటు 0.40% తగ్గి 8.20 శాతానికి చేరింది. ఏడాది రేటు 0.15 శాతం తగ్గి 8.55 శాతానికి చేరింది.  

ఇండియన్‌ బ్యాంక్‌:  అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ 0.15 శాతం తగ్గించింది.  
♦  విజయా బ్యాంక్‌: ఏడాది కాలపరిమితి రేటు 0.15 శాతం తగ్గి 8.50కి చేరింది.  
♦  ఐడీబీఐ బ్యాంక్‌: అన్ని కాల వ్యవధులపై రేటు 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.  
♦  ఇప్పటికే పీఎన్‌బీ,   యూనియన్‌ బ్యాంక్, దేనాబ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపును ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement