
మహిళలను తొక్కేస్తున్న వెబ్ మీడియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వార్తా వెబ్సైట్లు మహిళల అందానికిచ్చే ప్రాధాన్యం, వారి ఆలోచనలకు ఇవ్వడంలేదట.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వార్తా వెబ్సైట్లు మహిళల అందానికిచ్చే ప్రాధాన్యం, వారి ఆలోచనలకు ఇవ్వడంలేదట. పురుషులకు సంబంధించి విషయ అవగాహనకు, విశ్లేషణలకు వెబ్సైట్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని తేలింది. ఆన్లైన్లోని వార్తల్లో పురుషుల అభిప్రాయాలు, వాదనలు అక్షరాలతో డామినేట్ చేస్తే మహిళలు మాత్రం ఎక్కువగా ఫోటోలకే పరిమితమయ్యారని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ అండ్ కార్డిఫ్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
అనుభవం లేదు అనే కారణం చూపిస్తూ మహిళలు ఎక్కువగా ఫీచర్స్ ఆర్టికల్స్, ఫ్యాషన్, ఎంటర్ టైన్ మెంట్, ఆర్ట్లకే పరిమితవ్వగా పురుషులు మాత్రం స్పోర్ట్స్, పాలిటిక్స్వంటి వాటిలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందట. 950 వార్తా వెబ్సైట్లు, 23 లక్షల ఆర్టికల్లు, 6 నెలల సమయం తీసుకొని ఈ పరిశోధనలు చేశారు. వార్తల్లో అట్రాక్షన్ కోసమే కేవలం అలంకార ప్రాయంగానే మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ విషయ పరిజ్ఞానికి వచ్చేసరికి తక్కువ ప్రాధాన్యం లభిస్తోందని తేలింది.