
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టాలనుంచి స్వల్పంగా కోలుకుంది. రోజుకో కొత్త కనిష్టాన్ని తాకుతున్న రూపాయి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త కోలుకుంది. వరుసగా అయిదురోజుల రికార్డు పతనం ముఖ్యంగా మంగళవారం నాటి చరిత్రాత్మక కనిష్టం నుంచి పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో18 పైసలు(0.25 శాతం) బలపడి 71.40 వద్ద మొదలైంది. ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.51 వద్ద ట్రేడవుతోంది.
కాగా మంగళవారం ఆరంభంలో రూపాయి కొద్దిగా కోలుకున్నా చివరికి 37 పైసలు(0.5 శాతం) పతనమై రికార్డు కనిష్టం 71.58 వద్ద ముగిసింది. వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతుండటం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు విశ్లేషించాయి. మరి బుధవారం వరుస నష్టాలనుంచి తెప్పరిల్లుతుందా, లేక ముగింపులో ఎనలిస్టులు భయపడుతున్నట్టుగా మరింత పతనమవుతుందా అనేది కీలకం.
Comments
Please login to add a commentAdd a comment