సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు స్వల్ప లాభాలతో పాజిటివ్ నోట్ తో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 33,637 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 10331 వద్ద ముగిశాయి. మిడ్‌క్యాప్, బ్యాంక్ నిఫ్టీకూడా గ్రీన్‌లోనే ముగిశాయి. చైనా- అమెరికా ట్రేడ్‌వార్ ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగింది. మరోవైపు ఈ సాయంత్రం మరో ఆసక్తికర ప్రకటనకు చైనా సిద్ధమవుతోంది.లుపిన్, బీపీసీఎల్, టైటన్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్ , మారుతి సుజుకి, టెక్ మహీంద్ర, ఎంఫసిస్, పిరామిల్, జూబ్లియంట్, ఫెడరల్ బ్యాంక్ లాభపడగా, వక్రంగీ, ఐడియా, అదానీ, భారతీ, వేదాంతా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్‌ఆటో, అల్ట్రాటెక్, విప్రో, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం,బజాజ్ ఆటో, ఎల్‌అండ్‌టీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment