సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలకు పరిమితమయ్యాయి. దాదాపు100పాయింట్లకుపైగా పతనమైన కీలక సూచీలు ఆరంభ నష్టాలనుంచి చివర్లో పుంజుకుని స్వల్ప నష్టాలతో పటిష్టంగా ముగిశాయి. ముఖ్యంగా ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టు ముగింపునేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ 38700వ స్థాయిని, నిఫ్టీ 11700 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టంతో 38,690 వద్ద నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 11,677 వద్ద ముగిసాయి.
ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు 1.2 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ 0.7 శాతం ఎగశాయి. ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో స్వల్ప నష్టపోయాయి. సన్ పార్మా, గెయిల్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, యూపీఎల్, ఐటీసీ, ఎయిర్‌టెల్, హిందాల్కో, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ లాభపడగా, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, ఇండస్‌ఇండ్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్‌ఐఎల్, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌బ్యాంక్ నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment